Monday, December 5, 2011

మరుగేలరా ఓ రాఘవా - త్యాగ రాజ కృతులు

రాగం: జయంతశ్రీ
మేళ కర్త: 20 నటభైరవి  జన్య
అగ-శుమ-శుదై-కైని
ఆ  : స  గ మ ద  ని స
అవ : స  ని  ద  మ  ప  గ  స
తాళం: దేశాది
 
పల్లవి  
మరుగేలరా  ఓ  రాఘవ
 
అనుపల్లవి  
మరుగేల  చరా చర  రూప  పరాత్పర  సూర్య  సుధాకర  లోచన  
 
చరణం  
అన్ని  నీవనుచు  అంతరంగమున  తిన్నగా  వెదకి  తెలిసి  కొంటినయ్య
నిన్నే  గాని  మది  నెన్నజాల  నొరుల  నన్ను  బ్రోవవయ్య  త్యాగరాజనుత  

అప్ప రామ భక్తీ - త్యాగ రాజ కృతులు

రాగం: కామవర్ధని
మేళ కర్త : 51 పంతువరాళి  
శురి-అగ-పమ-శుదై-కాని
ఆ: స రి గ మ ప ద ని స
అవ  : స ని  ద  ప  మ గ  రి  స
తాళం: రూపక

పల్లవి
అప్ప!  రామభక్తి  ఎంతో   గొప్పరా; మా  (అప్ప)
 
అనుపల్లవి
త్రిప్పటలను దీర్చి  కంటి  రెప్పవలెను  గాచు  మా  (అప్ప)  

చరణం 1
లక్ష్మి  దేవి  వలచున? లక్ష్మణుండు  గొలుచునా?
సూక్ష్మబుద్ధి  గల  భరతుడు  జూచి జూచి  సోలసున? మా (అప్ప)
 
చరణం  2
శబరి  ఎంగిలి  నిచ్చునా? చంద్రధరుడు  మెచ్చునా?
అబల స్వయంప్రభకు  దైవమచల  పదవి  నిచ్చునా ? మా (అప్ప)

చరణం 3
కపి  వారధి  దాటున  కలికి  రోత  గాటున
అపరాధి  త్యాగరాజుకనందము  హెచ్చున ? మా (అప్ప)

Wednesday, November 30, 2011

నిన్ను కోరీ - ఘర్షణ

నిన్ను   కోరీ  వర్ణం  వర్ణం
సరి  సరి కలిసే  నీ  నయనం  నయనం
ఉఉరికిన  వాగల్లె
తొలకరి  కవితల్లె
తలపులు  కదిలేనే
చెలిమది  విరిసేనే
రవికుల  రఘురామ  అనుదినము  || నిన్ను  కోరి||

వుడికించే  చిలకమ్మా  నిన్నురించే
వోలికించే  అందాలే   ఆలపించే
ముత్యాల  బంధాలే  నీకంధించే
అచ్చట్లు   ముచ్చట్లు  తానసించే
మోజుల్లోన  చిన్నది  నీవే  తానూ  అన్నది
కల్లలే  విందు  చేసెనే
నీతో  పొందు  కోరనే
ఉండాల్లని  నీ  తోడూ  చేరిందిలే  ఈ  నాడు  సరసకు  || నిన్ను  కోరి  ||

ఈ  వీణ  మీటేది  నీవే  నంట
నా  తలపు  నా  వలపు  నీదే  నంట
పరువాల  పరదాలు  తీసే పూట
కలవాలి  కరగాలి  నీలో  నంట
పలికించాలి  స్వాగతం
పండించాలి  జీవితం
నీకు  నాకు  ఈ  క్షణం
కాని రాగ  సంగమం
నీ  జ్ఞాపకం  నా  లోనే  సాగేనులే  ఈ  వేళ  సరసకు  || నిన్ను  కోరి  ||

Tuesday, November 22, 2011

గీతాంజలి - జల్లంత కవ్వింత

జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2

వాగులూ … వంకలూ … జల  జలా  చిలిపిగా  పిలిచినా
గాలులూ … వానలూ … చిటపటా  చినుకులే  చిలికినా
మనసు  ఆగదు … ఇదేమి  అల్లరో
తనువు  దాగదు … అదేమీ  తాకిడో
కోనచాటు  కొండమల్లె  లేనివంక  ముద్దులాడి
వెళ్ళదాయె  కళ్ళు  లేని  దేవుడెందుకో  మరి


జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2


సందెలో  రంగులే … నొసటిపై  తిలకమే  నిలుపగా
తెలిపెనీ  మనసులే … తెలియని  తపనలే  తెలుపగా
వానదేవుడే  కల్లాపి  జల్లగా …
వాయుదేవుడే  ముగ్గేసి  వెళ్ళగా …
నీలిమంట  గుండెలోని  ఊసులన్ని  తెలుసుకున్న
కొత్త  పాట  పుట్టుకొచ్చే  ఎవరికోసమో ..


జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2

Wednesday, November 9, 2011

బంటు రీతి - కర్ణాటక సంగీతం


రాగం : హంసనాద  (60 వ  మేళ  (నీతిమతి ) జన్యం ) 
ఆరో : S R2 M2 P N3 S ||
ఆవ : S N3 P M2 R2 S ||
తాళం : ఆది

పల్లవి:
బంటు  రీతి  కొలువియ్యవయ్య  రామ ||౪||

 
అనుపల్లవి:
తుంట  వింటి  వని  మొదలైన  మదాదుల
గొట్టి  నేలగుల  జేయు  నిజ  (బంటు)


చరణం:
రోమాంచమను   ఘన  కంచుకము
రామ  భక్తుడను  ముద్ర  బిళ్ళయు
రామ  నామమను   వర  ఖడ్గమివి
రాజిల్లునయ్య  త్యాగరాజునికే  (బంటు)

చూడుమదే చెలియా - విప్రనారాయణ

చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

బృందావని లో నంద కిశోరుడు ||౨||
అందముగా చూపించే లీల ...

చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

మురళి క్రిష్ణుని మోహన గీతికి.. మురళి  క్రిష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే...పరవశమైనవి లోకములే
విరబూసినవి పొన్నలు పొగడలు ||౨||
పరిమళమెగసెను  మలయా నిలముల సోలెను యమునా


చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

నారి నారి నడుమ మురారి ||౨||
హరికి హరికి నడుమ వయ్యారి
తానొకడైన....తానొకడైన తలకొక రూపై ||౨||
మనసుల దోచే రాధ మాధవ కేళి నటనా




చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా


కలనైన నీ వలపే - శాంతి నివాసం


తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
నికొరకే రాజా..వెన్నెల రాజ

కలనైన నీ వలపే ||౨||
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు 
కళలు కాంతులు నీ కొరకేలే  ||౨||
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

కనుల మనోరథ మాధురి దాచి  ..ఆ ఆ......
కానుక చేసే వేలకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల 
వేడుచు నీకై వేచి  నిలచెరా 

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే




Monday, November 7, 2011

విరించినై - సిరి వెన్నెల

విధాత  తలపున  ప్రభవించినది  అనాది  జీవన  వేదం
ఓం!  ప్రాణ  నాడులకు  స్పందన  నొసగిన  ఆది  ప్రణవ  నాదం
ఓం! కనుల  కొలనులో  ప్రతిబింబించిన  విశ్వరూప  విన్యాసం
ఎద  కనుమలలో  ప్రతిధ్వనించిన  విరించి  విపంచి  గానం
సరస స్వర  సుర  ఝరీ  గమనమౌ సామవేద  సారమిది
నే  పాడిన  జీవన  గీతం  ఈ  గీతం
విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం


ప్రాగ్దిస  వీణియపైన    దినకర  మయూఖ  తంత్రులపైన
ప్రాగ్దిస  వీణియపైన   దినకర  మయూఖ  తంత్రులపైన
జాగ్రుత  విహంగ  తతులే  వినీల  గగనపు  వేదికపైన
పలికిన  కిల  కిల  తనముల  స్వరముల  దొరకని  జగతికి   శ్రీకారము  కాగా
విశ్వ  కావ్యమునకిది  భాష్యముగా

విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం 

జనించు  ప్రతి  శిశు  గళమున  పలికిన  జీవన  నాద  తరంగం
చేతన  పొందిన  స్పందన  ధ్వనించు  హృదయ  మృదంగ  ధ్వానం
అనాది  రాగం  ఆది  తాళమున  అనంత  జీవన  వాహినిగా సాగిన  సృష్టి  విలాసమునే

విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం


నా  ఉచ్చ్వాసం  కవనం  నా  నిశ్వాసం  గానం
సర  స స్వర  సుర  జరిగామనమౌ సామవేద  సారమిది 

ఆది బిక్షువు - సిరి వెన్నెల

ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది


తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
కరకు  గర్జనల  మేఘముల  మేనికి  మెరుపు  హంగు  కూర్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


తేనెలొలికే  పూల  బాలలకు  మూన్నాళ   ఆయువిచ్చిన  వాడినేది  కోరేది
బండ  రాళ్ళను  చిరాయువగా  జీవించమని  ఆనతిచ్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


గిరిబాలతో  తనకు  కళ్యాణ  మొనరించ దరిజేరు  మన్మధుని  మసి  చేసినాడ వాడినేది  కోరేది
వర  గర్వమున  మూడు  లోకాలు  పీడంప  తలపోయు  దనుజులను  కరుణించినాడు వాడినేది  అడిగేది 
ముఖ  ప్రీతి  కోరేటి  ఉగ్గు  శంకరుడు  వాడినేది  కోరేది
ముక్కంటి  ముక్కోపి  ముక్కంటి  ముక్కోపి  తిక్క  శంకరుడు

నిదురించే తోటలోకి - ముత్యాల ముగ్గు

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్ల్లిందీ..
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది  ||౨||
శూన్యమైన వేణువలో ఒక స్వరం కలిపి నిలిపింది ... ||౨||
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి ||౨||
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నదికోసుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురమంటోందని నావకు చెప్పండి...  నావకు చెప్పండి.

Sunday, November 6, 2011

నడిరేయి ఏ జాములో - రంగుల రాట్నం

నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో
తిరుమల శిఖరాలు దిగి వచ్చునో(నడిరేయి)
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ(2)
పతిదేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి న బాధ వినిపించలేను
అమ్మా....ఆ...ఆ..ఆ..
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా....ఆ...ఆ...
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా(విభునికి)

కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ అనురగవల్లీ
అడగవే మాయమ్మ అలివేలు మంగా(నడిరేయి)

Wednesday, November 2, 2011

శేషశైలావాస - వెంకటేశ్వర మహత్యం

శేషశైలావాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస 
శేషశైలావాస శ్రీ వెంకటేశ 

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలుమంగకు అలుకరానియ్యకు ..
ముద్దు సతులిద్దరిని ఇరు వైపులా జేర్చి  ||౨||
మురిపించి లాలించి ముచ్చటలకేర్చి 

శేషశైలావాస శ్రీ వెంకటేశ 

పట్టు పానుపు పైన పవళించర స్వామి 
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ 
చిరు నగవు లోలుకుచు నిదురించు నీ మోము  ||౨||
కరువు తీర కాంచి తరియించుము  మేము 

శేషశైలావాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస 


పాల కడలి పై - చెంచు లక్ష్మి

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా... ||౨||
బాలుని నను దయపాలించుటకై కనుపించేవ మహానుభావా.. ||౨|
పాల కడలి  పై... శేష తల్పమున పలళించేవా  దేవా

అలకలు అల్లలాడుతూ  ముసరగ ||౨||
నెల నవ్వులు పులకించే మోము ||౨||
చెలి కన్నుల కరుణా రసరుశ్టి.....ఈ ....
చెలి కన్నుల కరుణా రసరుశ్టి
తిలకించెన మై పులకించే స్వామి 

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా

ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా 
వేద మంత్రములు విరించి చదువా  ||౨||
నారదాది ముని ముఖ్యులు చేరి ....ఈ .... ||౨||
మొదమలర నిను గానము సేయగా 

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా


Tuesday, November 1, 2011

శ్రీ రాముని చరితమును - లవకుశ

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ||౨||

చెలువమీర పంచవటి సీమలో
తమ  కొలువ చేయ  సౌమిత్రి ప్రేమతో 
తన కొలువ తీరే రాఘవుడు భామతో....

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

రాముగని ప్రేమగునే రావణు  చెల్లి 
ముకుచెవులు  కోసె సౌమిత్రి రోసిల్లి 
రావణుడా మాట విని పంతము పూని 
మైథిలిని కొనిపోయే  మాయను పన్నీ.....

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపుచేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతిఉపక్రుతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంకచేరి వెతెకెను నలుదిశలా ...

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

అ అ అ అ నాథ అ అ రఘు నా.. థా.. 
పా..హి పా..హి 

పాహిఅని అశోకవనిని శోకించే సీత  ||౨||
దరికిజని ముద్రికనిడి  తెలిపె  విభునివార్త
ఆ జనని శిరోమణి అందుకునే పావని ||౨||
లంకకొచ్చి రాముని కడకేగెను రివు రివ్వు మని 

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

దశరథ శూనుడు లంకను దాటి దశకంఠు తల కోసి  ||౨||
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే 
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను  కోరె  రఘుపతి 

అయో నిజపైనే అనుమానమా....
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలి కా ఈ పరీక్ష ......

పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత 
హుతవాహుడు చల్లబడి శ్లఘించెను మాత ||౨||
సురలు పొగడ ధరనిజతో పురికి తరలెను రఘునేత 

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా... వినుడోయమ్మా... 

శ్రీ రాఘవం దశరాథాత్మజ  మప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం 
ఆజాను బాహు అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి .....


పగలే వెన్నెల - పూజ ఫలం

ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ అ 
ఆ ఆ ఆ ఆ అ అ అ అ అ ఆ అ 

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెలా జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచే 
నీటిలోన కలువభామ పొంగి పూచే 
ఈ అనురాగమే జీవనరాగమై  ||౨||
ఎదలో తేనెజల్లు కురిసిపోదా 

పగలే వెన్నెలా జగమే ఊయల

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళి పాట విన్న నాగు శిరసునుపే 
ఈ అనుబంధమే మధురానందమై  ||౨||
ఇలపై నందనాలు నిలిచిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే 
పూల ఋతువు సైగ చూచి పికము పాడే ||౨||
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెల



Monday, October 31, 2011

నిన్నటిదాకా శిలనైన - మేఘసందేశం

నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ 
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా


సరస సరాగాల సుమరాణి నీ 
స్వరస సంగీతాల సారంగినీ  ||౨||
మువ్వ మువ్వకు  ముద్దు మురిపాలు పలుకా  ||౨||
మవ్వంపు నటనాల మాతంగినీ 
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల 

నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ 
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసీ నీ 
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ  ||౨||
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే ||౨||
చిరునవ్వు లో నేను సిరిమల్లి  నీ 
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు 
చెంత వెలిగేవేళ  ఈ చింత నీకెలా 

నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ 
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా

Sunday, October 30, 2011

తెలవారదేమో - శ్రుతి లయలు

తెలవారదేమో  స్వామీ
తెలవారదేమో  స్వామీ
నీ  తలపుల  మునుకలో
అలసిన  దేవేరి  అలమేలు  మంగకు

చెలువము  నేలగ  చెంగట  లేవని
కలతకు  నెలవై  నిలచిన  నెలతకు
చెలువము  నేలగ  చెంగట  లేవని
కలతకు  నెలవై  నిలచిన  నెలతకు
కలల  అలజడికి  నిద్దుర  కరువై
అలసిన  దేవేరి  అలసిన  దేవేరి  అలమేలు
మంగకూ

మక్కువ  మీరగ  అక్కున  చేరిచి
అంగజు  కేలిని  పొంగుచు  తేల్చగ
మక్కువ  మీరగ  అక్కున  చేరిచి
అంగజు  కేలిని  పొంగుచు  తేల్చగ
ఆ  మత్తునే మది  మరి  మరి  తలచగ
మరి  మరి  తలచగ
అలసిన  దేవేరి  అలమేలు  మంగకు
తెలవారదేమో  స్వామీ  గ  మా  ప  ని
తెలవారదేమో

స  ని  ద  ప  మా  ప  మా  గ  ని  స  గ  మా
 తెలవారదేమో  స్వామీ
ప  ని  ద  ప  మా  గ  మా
ప  స  ని  ద  ప  మా  గ  మా
ప  స  ని  రి  స  గ  రి  మా  గ  రి  స  రి  ని  స

తెలవారదేమో  స్వామీ 

Friday, October 28, 2011

వాతాపి

29 ధీర  శంకరాభరణం  జన్య
ఆ: S R2 G3 P N3 S
అవ : S N3 P G3 R2 S

రాగం : హంసధ్వని
తాళం : ఆది

పల్లవి  
వాతాపి  గణపతిం  భజేహం |
వారణాస్యం  వరా ప్రదం   శ్రీ  ||

అనుపల్లవి 
భూతాది  సంసేవిత  చరణం  |
భూత  బౌతిక   ప్రపంచ  భరణం  ||
వీతరాగిణం  వినత  యోగినం  (శ్రీ )  |
విశ్వ  కారణం  విఘ్న   వారణం  || (వాతాపి)  

చరణం  
పురా  కుంభ  సంభవ  మునివర  ప్రపూజితం  |
త్రికోణ  మధ్య  గతం  |
మురారి  ప్రముఖాత్  యుపాసితం  |
మూలాధార  క్షేత్రా  స్తితం  |
పరాది  సత్త్వారి  వాకాత్మగం  |
ప్రణవ  స్వరూప  వక్రతుండం  |
నిరంతరం నిడల  చంద్ర  ఖండం |
నిజ  వామకర  విద్రుతేక్షుతండం |
కరాంబుజుపాస  బీజాపూరం  |
కలుష  విదూరం  భూతాహారం    |
హరాది  గురుగుహ  తోషిత  బింబం  |
హంసధ్వని  భూషిత    హేరంబం  || (వాతాపి)

సంగీత జ్ఞానము

8 హనుమతోడి   జన్య
ఆ: S G2 M1 P N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S
తాళం : ఆది  

పల్లవి  
సంగీత  జ్ఞానము  భక్తీ  విన  సన్మార్గము  గలదే  మానస  
అనుపల్లవి  
భ్రుంగి నటేశ  సమీరజ  ఘటజ  మాతంగ  నారదాదులు ఉపాసించు  
అనుపల్లవి    న్యాయ  అన్యాయము  దెలుసును  జగముల  మయమని  దెలుసును  దుర్గుణ
కాయజాది  షడ్రిపుల  జయించు  కార్యము  దెలుసును  త్యాగరాజునికి  

నగుమోము గలవాని

నగుమోము  గలవాని  - త్యాగ రాజ కృతులు
రాగం :
మధ్యమావతి 
22 ఖరహరప్రియ  జన్య
: స  రీ   మ ప  నీ  స అవ : స  నీ  ప  మ  రీ  స  
తాళం : ఆది

పల్లవి: నగుమోము  గలవని  నా  మనోహరుని  జగమేలు  శూరుని  జానకీ వరునీ
చరణం 1
దేవాది  దేవుని  దివ్య  సుందరుని  శ్రీ  వాసుదేవుని  సీతా  రాఘవుని  
చరణం  2
సు -జ్ఞాన  నిధిని  సోమసుర్య  లోచనుని  అజ్ఞాన  తమమును  అణచు  భాస్కరుని  
చరణం 3
నిర్మలాకారుని  నిఖిలాఘ  హరుని  ధర్మాది  మోఖంబు  దయచేయు  ఘనుని  
చరణం  4
బొధతో  పలుమారు  పూజించి  నే ఆరాధించు  శ్రీ  త్యాగరాజ  సన్నుతుని  

చూడరమ్మ - అన్నమయ్య కీర్తనలు

ప: చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మకూడున్నది పతి చూడి కుడుత నాంచారి
చ: శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి

చ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

చ అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమౄతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

Monday, October 24, 2011

శివానీ - స్వాతి కిరణం

శివానీ భవానీ శర్వాణీ
గిరి నందిని శివ రంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని  సుతడనే శివాని ||శివాని||

శృంగారం తరంగించు  సౌందర్య లహరి వని..ఆ ఆ..ఆ
శాంతం మూర్తీ భవించు శివానంద లహరి వని
కరుణ జిలుగు చిరు నగవుల కనక  ధార వీవని
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారి యని
శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని ణీ సుతడనే శివాని ||శివాని||

రౌద్ర వీర రసోద్రిక్త భద్రకాళివీవని
భీతావహ భక్తాళికి  అభయ పాళి వీవని
భీభత్సనాల కీలవు  భీషణాస్త్ర కేళివని
భీభత్సనాల కీలవు  భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని

గిరి నందిని శివ రంజని భవ భంజనీ జననీ

శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని  సుతడనే శివాని  ||శివాని||


తెలి మంచు - స్వాతి కిరణం

తెలి  మంచు కరిగిందీ  తలుపు తీయన  ప్రభూ
ఇల గొంతు  వణికిందీ  పిలుపు నీయనా  ప్రభూ
తెలి  మంచు కరిగిందీ  తలుపు తీయన  ప్రభూ
ఇల గొంతు  వణికిందీ  పిలుపు నీయనా  ప్రభూ
నీ దోవ  పొడవునా   కువ కువలా  స్వాగతం
నీ  కాలి అలికిడికి  మెలకువల  వందనం

ఈ  పూల  రాగల  పూలకింత  గమకాలూ
గారాబూ కవనాల గాలి సంగతులూ
ఈ  పూల  రాగల  పూలకింత  గమకాలూ
గారాబూ కవనాల గాలి సంగతులూ
నీ  చరణ కిరణాలూ పలుకరించిన  చాలూ
పల్లవించునూ  ప్రభూ పవళించు భువనాలు  

భాను మూర్తీ  నీ ప్రాణ కీర్తన  వినీ
పలుకనీ  ప్రనతూలనే ప్రణవ శృతి నీ పాడనీ ప్రకృతినీ  ప్రధమ  కృతినీ ||తెలి||
భూపాల  నీ  మ్రోల  ఈ  బేల  గానాలూ
నీ  రాజసానీకవీ  నీరజనాలూ
భూపాల  నీ  మ్రోల  ఈ  బేల  గానాలూ
నీ  రాజసానీకవీ  నీరజనాలూ
పసరూ  పవనలలో పసికూన  రాగాలూ
పసిడీ  కీరణాల  
పడి  పదునూ  తెరిన  చాలూ
తలయూచూ  తలీరకూ  బహూపరాకుల  వినీ
దొరలనీ  దొరనగావూ  
దొంతరనీ తరలనీ  దరి  తొలగి రాతిరినీ ||తెలి||

Friday, October 21, 2011

సంగీత సాహిత్య - స్వాతి కిరణం

సంగీత  సాహిత్య  సమలంకృతే
సంగీత  సాహిత్య   సమలంకృతే
స్వర  రాగ  పదయోగ  సమభూషితే
హే  భారతి  మనసాస్మరామి
హే  భారతి  మనసాస్మరామి
శ్రీ  భారతి  శిరసానమామి
శ్రీ  భారతి  శిరసానమామి
సంగీత  సాహిత్య  సమలంకృతే


వేద  వేదాంత  వనవాసిని  పూర్ణ  శశి  హాసినీ    
నాద  నాదాంత  పరివేశిని  ఆత్మ సంభాషినీ
వేద  వేదాంత  వనవాసిని  పూర్ణ  శశి  హాసినీ
నాద  నాదాంత  పరివేశిని  ఆత్మ సంభాషినీ
వ్యాస  వాల్మీకి   వాగ్దాయిని
వ్యాస  వాల్మీకి   వాగ్దాయినీ  జ్ఞ్యానవల్లి సముల్లాసినీ   ||సంగీత||

బ్రహ్మ  రసనాగ్ర  సంచారిణీ
బ్రహ్మ  రసనాగ్ర  సంచారిణీ
భవ్య  ఫలకారిణి
నిత్య  చైతన్య  నిజరూపిణి  సత్య  సందీపినీ
బ్రహ్మ  రసనాగ్ర  సంచారిణి భవ్య  ఫలకారిణి
నిత్య  చైతన్య  నిజరూపిణి  సత్య  సందీపినీ
సకల  సుకళా సమున్వేషిణీ
సకల  సుకళా సమున్వేషిణీ
సర్వ  రస  భావ  సంజీవినీ ||సంగీత||


 

Thursday, October 20, 2011

ఆనతి నీయరా - స్వాతి కిరణం

ఆనతి   నీయరా  హరా
ఆ .. ఆనతి  నీయరా  హరా
సన్నుతి  సేయగా  సమ్మతి  నీయరా  దొరా  సన్నిధి  చేరగా
ఆనతి  నీయరా  హరా

సన్నుతి  సేయగా  సమ్మతి  నీయరా  దొరా  సన్నిధి  చేరగాఆనతి  నీయరా  హరా

నీ  ఆన  లేనిదే  రచింప   జాలునా
వేదాల  వాణితో  విరించి  విశ్వ నాటకం
నీ  సైగ  కానిదే  జగాన  సాగునా
ఆయోగమాయతో  మురారి  దివ్యపాలనం
వసుమతిలో  ప్రతి  క్షణం  పశుపతి  నీ  అధీనమై
వసుమతిలో  ప్రతి  క్షణం  పశుపతి  నీ  అధీనమై
కదులును  గా  సదా  సదాశివ
ఆనతి  నీయరా  హరా
ని  నీ  స  ని  ప  నీ  ప  మ గ  స  గ
ఆనతి  నీయరా
అచలనాధ  అర్చింతును  రా
ఆనతి  నీయరా
పమ  పని  పమ  పని  పమ  పని  గమ  పని
సని  సగ  సని   సగ  సని  సగ  పని  సగ
గమగసా  నిపమ  గమగస  మగసని
ఆనతి  నీయరా

జంగమ  దేవర  సేవలు  గొనరా
మంగళ  దాయక  దీవెనలిడరా
సాష్టాంగము  గ  దండము  చేటు  రా
ఆనతి  నీయరా
సానిప  గమపనిపమ
గమగ   పాపా  పాపా
మాపని  పాపా  పాపా
గగమ  గస  సస
నిసగ  సస  సస
సగ  గస  గాప  పమ  పస  నిస
గసని  సగ  సగ
సని  సగ  సగ
పగ  గాగ  గాగ
సని  సగ  గ
గసగ  గ
పద  గస  గ  మ  స  ని  పమగమ గ
ఆనతి  నీయరా
శంకరా శంకించకురా
వంక జాబిలిని జడన ముడుచుకుని

విషపు నాగులను చంక నెత్తుకుని
నిలుకడ నెరుగని గంగ నేలి ఏ వంక లేని నా వంక నొక్క
కడ గంట చూపు పడ నీయ వేమి నీ కింకరుని గ సేవించుకొందురా ..ఆ
ఆనతి  నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ పప పమప నినిపమగస గ గా
రక్షా ధర శిక్షా దీక్షా దక్షా
విరూపాక్షా  నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా
సమ్మతి నీయరా దొరా సన్నిధి జేరగా
ఆనతినీయరా, హరా!




ప్రణతి ప్రణతి - స్వాతి కిరణం

సా   రీ  గ  మ  ప  మ  గ  మ స  రి  రీ సా
ప  మ  గ  మ  స  రి  సా  రి  గ  మ  ప  ని   స  ని ప  మ  గ  మ  రి  రీ   సా
ప్రణతి  ప్రణతి  ప్రణతీ 
ప  మ  ప  మ  గ  మ  స  రి  సా
ప్రణతి  ప్రణతి  ప్రణతి ప్రణవ  నాద  జగతికీ 
ప మ ప  మ మ ప  మ  ప  నీ
ప్రణుతి  ప్రణుతి  ప్రణుతీ
ప్రధమ  కళా  సృష్టికి

పూల  ఎదలలో  పులకలు పొడిపించే  భ్రమరరవం  ఓంకారమా
సుప్రభాత  వేదికపై  సుకపికాది  కలరవం  ఐంకారమా
పూల  ఎదలలో  పులకలు పొడిపించే  భ్రమరరవం  ఓంకారమా
సుప్రభాత  వేదికపై సుకపికాది  కలరవం  ఐంకారమా
పైరు  పాపాలకు  జోలలు  పాడే  గాలుల  సవ్వడి  హ్రీమ్కారమ  హ్రీమ్కారమ
గిరుల  సిరసులను  జారే  ఝరుల  నడల  అలజడి  శ్రీమ్కారమా  శ్రీమ్కారమా
ఆ  బీజాక్షర  విగతికి  అర్పించే  జోతలివే   

పంచ  భూతముల పరిష్వంగమున  ప్రకృతి  పొందిన  పదస్పందనా  అది  కవనమా
మ  గ  మ  పా  ప  మ  పా  పా  ప 
ని ప ప ప  ని ప ప ప  ని పా ప ప మ గ  ప  మ  ప  మ  గా
అంతరంగమున  అలలెత్తిన  సర్వాంగ  సంచలనకే ళనా  అది  నటనమా  అది  నటనమా
కంటి  తుదల  హరివింటి  పొదల  తలుకందినసవర్ణ  లేఖనా  అది  చిత్రమా  అది  చిత్రమా  
మౌన  శిలల  చైతన్య  మూర్తులుగా మలచిన  సజీవ  కల్పనా  అది  శిల్పమా  అది  శిల్పమా
అది  శిల్పమా  అది  శిల్పమా
ఆ  లలితా  కళా  సృష్టికి  అర్పించే  జ్యోతలివే ||ప్రణతి||

శృతి నీవు గతి నీవు-స్వాతి కిరణం

శృతి   నీవు  గతి  నీవు   ఈ  నాకృతి  నీవు భారతీ
శృతి   నీవు  గతి  నీవు   ఈ  నాకృతి  నీవు  భారతీ
ఈ  నా కృతి  నీవు  భారతి
ఈ  నా కృతి  నీవు  భారతి
శృతి  నీవు  గతి  నీవు   ఈ  నాకృతి  నీవు  భారతీ
ధృతి   నీవు  ద్యుతి  నీవు  శరనా  గతి  నీవు  భారతీ
ధృతి  నీవు  ద్యుతి  నీవు  శరనా  గతి  నీవు భారతీ
శరనా  గతి  నీవు భారతీ
నీ  పదము  లోత్తిన  పదము ఈ  పదము  నిత్యకైవల్య  పథము

నీ  కొలువు   కోరిన  తనువూ ఈ  తనువూ  నిగమార్ధ  నిధులున్న నెలవు
కోరినా  మిగిలిన  కోరికేమి నిను కోనియాడు కృతుల  పెన్నిధి  తప్ప
చేరినా  యిక  చేరువున్న  దేమి నీ  శ్రీ చరణ  దివ్యసన్నిది  తప్ప  (శృతి  నీవు  X 1 )
శ్రీ  నాధ   కవి  నాధ శృంగార కవిత  తరంగాలు  నీ  స్పూర్తులే
అల  అన్నమాచర్య  కలవాణి అలరించు  కీర్తనలు  నీకీర్తులే
శ్రీ  నాధ   కవి నాధ శృంగార కవిత  తరంగాలు  నీ  స్పూర్తులే
అల  అన్నమాచర్య  కలవాణి అలరించు  కీర్తనలు  నీకీర్తులే
త్యాగయ్య  గళ సీమ  రాజిల్లిన ఆనంత  రాగాలు  నీ మూర్తులే  
నీ  కరుణ  నేలకున్న  ప్రతి  రచనం జననీ  భవతారక  మంత్రాక్షరం  (శృతి  నీవు  X 1 )

Sunday, January 9, 2011

మైత్రీం భజత

మైత్రీం  భజత , అఖిల  హరిత్  జైత్రీం  |
ఆత్మవాడ్  ఎవ  పరంన్  ఆపి  పశ్యత  |
యుద్హం  త్యజతా , స్పర్ధం  త్యజతా  |
త్యజతా  పరేషు  అక్రమ -అక్రమానం  ||
జనని  ప్రితివి  కామా -దుఖర్తే  |
జనకో  దేవః  సకల  దయాళుహ్  |
'దామ్యత , దత్త , దయధ్వం ' జనత  |
శ్రేయో  భుయాట్  సకల  జననానం  ||
శ్రేయో  భుయాట్  సకల  జననానం  ||
శ్రేయో  భుయాట్  సకల  జననానం  ||