Monday, November 7, 2011

నిదురించే తోటలోకి - ముత్యాల ముగ్గు

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్ల్లిందీ..
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది  ||౨||
శూన్యమైన వేణువలో ఒక స్వరం కలిపి నిలిపింది ... ||౨||
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి ||౨||
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నదికోసుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురమంటోందని నావకు చెప్పండి...  నావకు చెప్పండి.

No comments:

Post a Comment