Thursday, October 20, 2011

ప్రణతి ప్రణతి - స్వాతి కిరణం

సా   రీ  గ  మ  ప  మ  గ  మ స  రి  రీ సా
ప  మ  గ  మ  స  రి  సా  రి  గ  మ  ప  ని   స  ని ప  మ  గ  మ  రి  రీ   సా
ప్రణతి  ప్రణతి  ప్రణతీ 
ప  మ  ప  మ  గ  మ  స  రి  సా
ప్రణతి  ప్రణతి  ప్రణతి ప్రణవ  నాద  జగతికీ 
ప మ ప  మ మ ప  మ  ప  నీ
ప్రణుతి  ప్రణుతి  ప్రణుతీ
ప్రధమ  కళా  సృష్టికి

పూల  ఎదలలో  పులకలు పొడిపించే  భ్రమరరవం  ఓంకారమా
సుప్రభాత  వేదికపై  సుకపికాది  కలరవం  ఐంకారమా
పూల  ఎదలలో  పులకలు పొడిపించే  భ్రమరరవం  ఓంకారమా
సుప్రభాత  వేదికపై సుకపికాది  కలరవం  ఐంకారమా
పైరు  పాపాలకు  జోలలు  పాడే  గాలుల  సవ్వడి  హ్రీమ్కారమ  హ్రీమ్కారమ
గిరుల  సిరసులను  జారే  ఝరుల  నడల  అలజడి  శ్రీమ్కారమా  శ్రీమ్కారమా
ఆ  బీజాక్షర  విగతికి  అర్పించే  జోతలివే   

పంచ  భూతముల పరిష్వంగమున  ప్రకృతి  పొందిన  పదస్పందనా  అది  కవనమా
మ  గ  మ  పా  ప  మ  పా  పా  ప 
ని ప ప ప  ని ప ప ప  ని పా ప ప మ గ  ప  మ  ప  మ  గా
అంతరంగమున  అలలెత్తిన  సర్వాంగ  సంచలనకే ళనా  అది  నటనమా  అది  నటనమా
కంటి  తుదల  హరివింటి  పొదల  తలుకందినసవర్ణ  లేఖనా  అది  చిత్రమా  అది  చిత్రమా  
మౌన  శిలల  చైతన్య  మూర్తులుగా మలచిన  సజీవ  కల్పనా  అది  శిల్పమా  అది  శిల్పమా
అది  శిల్పమా  అది  శిల్పమా
ఆ  లలితా  కళా  సృష్టికి  అర్పించే  జ్యోతలివే ||ప్రణతి||

No comments:

Post a Comment