శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతీ
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతీ
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతీ
ధృతి నీవు ద్యుతి నీవు శరనా గతి నీవు భారతీ
ధృతి నీవు ద్యుతి నీవు శరనా గతి నీవు భారతీ
శరనా గతి నీవు భారతీ
నీ కొలువు కోరిన తనువూ ఈ తనువూ నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కోనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా యిక చేరువున్న దేమి నీ శ్రీ చరణ దివ్యసన్నిది తప్ప (శృతి నీవు X 1 )
శ్రీ నాధ కవి నాధ శృంగార కవిత తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీకీర్తులే
శ్రీ నాధ కవి నాధ శృంగార కవిత తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీకీర్తులే
త్యాగయ్య గళ సీమ రాజిల్లిన ఆనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నేలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం (శృతి నీవు X 1 )
No comments:
Post a Comment