Monday, November 7, 2011

ఆది బిక్షువు - సిరి వెన్నెల

ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది


తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
కరకు  గర్జనల  మేఘముల  మేనికి  మెరుపు  హంగు  కూర్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


తేనెలొలికే  పూల  బాలలకు  మూన్నాళ   ఆయువిచ్చిన  వాడినేది  కోరేది
బండ  రాళ్ళను  చిరాయువగా  జీవించమని  ఆనతిచ్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


గిరిబాలతో  తనకు  కళ్యాణ  మొనరించ దరిజేరు  మన్మధుని  మసి  చేసినాడ వాడినేది  కోరేది
వర  గర్వమున  మూడు  లోకాలు  పీడంప  తలపోయు  దనుజులను  కరుణించినాడు వాడినేది  అడిగేది 
ముఖ  ప్రీతి  కోరేటి  ఉగ్గు  శంకరుడు  వాడినేది  కోరేది
ముక్కంటి  ముక్కోపి  ముక్కంటి  ముక్కోపి  తిక్క  శంకరుడు

No comments:

Post a Comment