Monday, October 24, 2011

శివానీ - స్వాతి కిరణం

శివానీ భవానీ శర్వాణీ
గిరి నందిని శివ రంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని  సుతడనే శివాని ||శివాని||

శృంగారం తరంగించు  సౌందర్య లహరి వని..ఆ ఆ..ఆ
శాంతం మూర్తీ భవించు శివానంద లహరి వని
కరుణ జిలుగు చిరు నగవుల కనక  ధార వీవని
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారి యని
శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని ణీ సుతడనే శివాని ||శివాని||

రౌద్ర వీర రసోద్రిక్త భద్రకాళివీవని
భీతావహ భక్తాళికి  అభయ పాళి వీవని
భీభత్సనాల కీలవు  భీషణాస్త్ర కేళివని
భీభత్సనాల కీలవు  భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని

గిరి నందిని శివ రంజని భవ భంజనీ జననీ

శతవిధాల శ్రుతి విధాన కృతులు పలుకలేని  సుతడనే శివాని  ||శివాని||


No comments:

Post a Comment