Wednesday, November 30, 2011

నిన్ను కోరీ - ఘర్షణ

నిన్ను   కోరీ  వర్ణం  వర్ణం
సరి  సరి కలిసే  నీ  నయనం  నయనం
ఉఉరికిన  వాగల్లె
తొలకరి  కవితల్లె
తలపులు  కదిలేనే
చెలిమది  విరిసేనే
రవికుల  రఘురామ  అనుదినము  || నిన్ను  కోరి||

వుడికించే  చిలకమ్మా  నిన్నురించే
వోలికించే  అందాలే   ఆలపించే
ముత్యాల  బంధాలే  నీకంధించే
అచ్చట్లు   ముచ్చట్లు  తానసించే
మోజుల్లోన  చిన్నది  నీవే  తానూ  అన్నది
కల్లలే  విందు  చేసెనే
నీతో  పొందు  కోరనే
ఉండాల్లని  నీ  తోడూ  చేరిందిలే  ఈ  నాడు  సరసకు  || నిన్ను  కోరి  ||

ఈ  వీణ  మీటేది  నీవే  నంట
నా  తలపు  నా  వలపు  నీదే  నంట
పరువాల  పరదాలు  తీసే పూట
కలవాలి  కరగాలి  నీలో  నంట
పలికించాలి  స్వాగతం
పండించాలి  జీవితం
నీకు  నాకు  ఈ  క్షణం
కాని రాగ  సంగమం
నీ  జ్ఞాపకం  నా  లోనే  సాగేనులే  ఈ  వేళ  సరసకు  || నిన్ను  కోరి  ||

Tuesday, November 22, 2011

గీతాంజలి - జల్లంత కవ్వింత

జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2

వాగులూ … వంకలూ … జల  జలా  చిలిపిగా  పిలిచినా
గాలులూ … వానలూ … చిటపటా  చినుకులే  చిలికినా
మనసు  ఆగదు … ఇదేమి  అల్లరో
తనువు  దాగదు … అదేమీ  తాకిడో
కోనచాటు  కొండమల్లె  లేనివంక  ముద్దులాడి
వెళ్ళదాయె  కళ్ళు  లేని  దేవుడెందుకో  మరి


జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2


సందెలో  రంగులే … నొసటిపై  తిలకమే  నిలుపగా
తెలిపెనీ  మనసులే … తెలియని  తపనలే  తెలుపగా
వానదేవుడే  కల్లాపి  జల్లగా …
వాయుదేవుడే  ముగ్గేసి  వెళ్ళగా …
నీలిమంట  గుండెలోని  ఊసులన్ని  తెలుసుకున్న
కొత్త  పాట  పుట్టుకొచ్చే  ఎవరికోసమో ..


జల్లంత   కవ్వింత  కావాలిలే …
ఒళ్ళంత   తుళ్ళింత  రావాలిలే  - 2
ఉరుకులు పరుగులు  ఉడుకు  వయసు  దుడుకు  తనం  నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన  కలికి  సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో  వెన్నెల్లు  తెచ్చిందిలే    - 2

Wednesday, November 9, 2011

బంటు రీతి - కర్ణాటక సంగీతం


రాగం : హంసనాద  (60 వ  మేళ  (నీతిమతి ) జన్యం ) 
ఆరో : S R2 M2 P N3 S ||
ఆవ : S N3 P M2 R2 S ||
తాళం : ఆది

పల్లవి:
బంటు  రీతి  కొలువియ్యవయ్య  రామ ||౪||

 
అనుపల్లవి:
తుంట  వింటి  వని  మొదలైన  మదాదుల
గొట్టి  నేలగుల  జేయు  నిజ  (బంటు)


చరణం:
రోమాంచమను   ఘన  కంచుకము
రామ  భక్తుడను  ముద్ర  బిళ్ళయు
రామ  నామమను   వర  ఖడ్గమివి
రాజిల్లునయ్య  త్యాగరాజునికే  (బంటు)

చూడుమదే చెలియా - విప్రనారాయణ

చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

బృందావని లో నంద కిశోరుడు ||౨||
అందముగా చూపించే లీల ...

చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

మురళి క్రిష్ణుని మోహన గీతికి.. మురళి  క్రిష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే...పరవశమైనవి లోకములే
విరబూసినవి పొన్నలు పొగడలు ||౨||
పరిమళమెగసెను  మలయా నిలముల సోలెను యమునా


చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా

నారి నారి నడుమ మురారి ||౨||
హరికి హరికి నడుమ వయ్యారి
తానొకడైన....తానొకడైన తలకొక రూపై ||౨||
మనసుల దోచే రాధ మాధవ కేళి నటనా




చూడుమదే చెలియా కనులా
చూడుమదే చెలియా


కలనైన నీ వలపే - శాంతి నివాసం


తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
నికొరకే రాజా..వెన్నెల రాజ

కలనైన నీ వలపే ||౨||
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు 
కళలు కాంతులు నీ కొరకేలే  ||౨||
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

కనుల మనోరథ మాధురి దాచి  ..ఆ ఆ......
కానుక చేసే వేలకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల 
వేడుచు నీకై వేచి  నిలచెరా 

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే




Monday, November 7, 2011

విరించినై - సిరి వెన్నెల

విధాత  తలపున  ప్రభవించినది  అనాది  జీవన  వేదం
ఓం!  ప్రాణ  నాడులకు  స్పందన  నొసగిన  ఆది  ప్రణవ  నాదం
ఓం! కనుల  కొలనులో  ప్రతిబింబించిన  విశ్వరూప  విన్యాసం
ఎద  కనుమలలో  ప్రతిధ్వనించిన  విరించి  విపంచి  గానం
సరస స్వర  సుర  ఝరీ  గమనమౌ సామవేద  సారమిది
నే  పాడిన  జీవన  గీతం  ఈ  గీతం
విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం


ప్రాగ్దిస  వీణియపైన    దినకర  మయూఖ  తంత్రులపైన
ప్రాగ్దిస  వీణియపైన   దినకర  మయూఖ  తంత్రులపైన
జాగ్రుత  విహంగ  తతులే  వినీల  గగనపు  వేదికపైన
పలికిన  కిల  కిల  తనముల  స్వరముల  దొరకని  జగతికి   శ్రీకారము  కాగా
విశ్వ  కావ్యమునకిది  భాష్యముగా

విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం 

జనించు  ప్రతి  శిశు  గళమున  పలికిన  జీవన  నాద  తరంగం
చేతన  పొందిన  స్పందన  ధ్వనించు  హృదయ  మృదంగ  ధ్వానం
అనాది  రాగం  ఆది  తాళమున  అనంత  జీవన  వాహినిగా సాగిన  సృష్టి  విలాసమునే

విరించినై  విరచించితిని   ఈ  కవనం
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం


నా  ఉచ్చ్వాసం  కవనం  నా  నిశ్వాసం  గానం
సర  స స్వర  సుర  జరిగామనమౌ సామవేద  సారమిది 

ఆది బిక్షువు - సిరి వెన్నెల

ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఆది   బిక్షువు  వాడినేది  కోరేది
బూడిదిచ్చే  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది


తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
కరకు  గర్జనల  మేఘముల  మేనికి  మెరుపు  హంగు  కూర్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


తేనెలొలికే  పూల  బాలలకు  మూన్నాళ   ఆయువిచ్చిన  వాడినేది  కోరేది
బండ  రాళ్ళను  చిరాయువగా  జీవించమని  ఆనతిచ్చిన  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది
ఏది  కోరేది  వాడినేది  అడిగేది 


గిరిబాలతో  తనకు  కళ్యాణ  మొనరించ దరిజేరు  మన్మధుని  మసి  చేసినాడ వాడినేది  కోరేది
వర  గర్వమున  మూడు  లోకాలు  పీడంప  తలపోయు  దనుజులను  కరుణించినాడు వాడినేది  అడిగేది 
ముఖ  ప్రీతి  కోరేటి  ఉగ్గు  శంకరుడు  వాడినేది  కోరేది
ముక్కంటి  ముక్కోపి  ముక్కంటి  ముక్కోపి  తిక్క  శంకరుడు

నిదురించే తోటలోకి - ముత్యాల ముగ్గు

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్ల్లిందీ..
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది  ||౨||
శూన్యమైన వేణువలో ఒక స్వరం కలిపి నిలిపింది ... ||౨||
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నులో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది ||౨||

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి ||౨||
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నదికోసుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురమంటోందని నావకు చెప్పండి...  నావకు చెప్పండి.

Sunday, November 6, 2011

నడిరేయి ఏ జాములో - రంగుల రాట్నం

నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో
తిరుమల శిఖరాలు దిగి వచ్చునో(నడిరేయి)
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ(2)
పతిదేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి న బాధ వినిపించలేను
అమ్మా....ఆ...ఆ..ఆ..
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా....ఆ...ఆ...
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా(విభునికి)

కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ అనురగవల్లీ
అడగవే మాయమ్మ అలివేలు మంగా(నడిరేయి)

Wednesday, November 2, 2011

శేషశైలావాస - వెంకటేశ్వర మహత్యం

శేషశైలావాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస 
శేషశైలావాస శ్రీ వెంకటేశ 

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలుమంగకు అలుకరానియ్యకు ..
ముద్దు సతులిద్దరిని ఇరు వైపులా జేర్చి  ||౨||
మురిపించి లాలించి ముచ్చటలకేర్చి 

శేషశైలావాస శ్రీ వెంకటేశ 

పట్టు పానుపు పైన పవళించర స్వామి 
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ 
చిరు నగవు లోలుకుచు నిదురించు నీ మోము  ||౨||
కరువు తీర కాంచి తరియించుము  మేము 

శేషశైలావాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస 


పాల కడలి పై - చెంచు లక్ష్మి

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా... ||౨||
బాలుని నను దయపాలించుటకై కనుపించేవ మహానుభావా.. ||౨|
పాల కడలి  పై... శేష తల్పమున పలళించేవా  దేవా

అలకలు అల్లలాడుతూ  ముసరగ ||౨||
నెల నవ్వులు పులకించే మోము ||౨||
చెలి కన్నుల కరుణా రసరుశ్టి.....ఈ ....
చెలి కన్నుల కరుణా రసరుశ్టి
తిలకించెన మై పులకించే స్వామి 

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా

ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా 
వేద మంత్రములు విరించి చదువా  ||౨||
నారదాది ముని ముఖ్యులు చేరి ....ఈ .... ||౨||
మొదమలర నిను గానము సేయగా 

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా


Tuesday, November 1, 2011

శ్రీ రాముని చరితమును - లవకుశ

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ||౨||

చెలువమీర పంచవటి సీమలో
తమ  కొలువ చేయ  సౌమిత్రి ప్రేమతో 
తన కొలువ తీరే రాఘవుడు భామతో....

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

రాముగని ప్రేమగునే రావణు  చెల్లి 
ముకుచెవులు  కోసె సౌమిత్రి రోసిల్లి 
రావణుడా మాట విని పంతము పూని 
మైథిలిని కొనిపోయే  మాయను పన్నీ.....

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపుచేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతిఉపక్రుతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంకచేరి వెతెకెను నలుదిశలా ...

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

అ అ అ అ నాథ అ అ రఘు నా.. థా.. 
పా..హి పా..హి 

పాహిఅని అశోకవనిని శోకించే సీత  ||౨||
దరికిజని ముద్రికనిడి  తెలిపె  విభునివార్త
ఆ జనని శిరోమణి అందుకునే పావని ||౨||
లంకకొచ్చి రాముని కడకేగెను రివు రివ్వు మని 

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా

దశరథ శూనుడు లంకను దాటి దశకంఠు తల కోసి  ||౨||
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే 
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను  కోరె  రఘుపతి 

అయో నిజపైనే అనుమానమా....
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలి కా ఈ పరీక్ష ......

పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత 
హుతవాహుడు చల్లబడి శ్లఘించెను మాత ||౨||
సురలు పొగడ ధరనిజతో పురికి తరలెను రఘునేత 

శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా... వినుడోయమ్మా... 

శ్రీ రాఘవం దశరాథాత్మజ  మప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం 
ఆజాను బాహు అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి .....


పగలే వెన్నెల - పూజ ఫలం

ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ అ 
ఆ ఆ ఆ ఆ అ అ అ అ అ ఆ అ 

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెలా జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచే 
నీటిలోన కలువభామ పొంగి పూచే 
ఈ అనురాగమే జీవనరాగమై  ||౨||
ఎదలో తేనెజల్లు కురిసిపోదా 

పగలే వెన్నెలా జగమే ఊయల

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళి పాట విన్న నాగు శిరసునుపే 
ఈ అనుబంధమే మధురానందమై  ||౨||
ఇలపై నందనాలు నిలిచిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే 
పూల ఋతువు సైగ చూచి పికము పాడే ||౨||
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెల