విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిస వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన

జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల తనముల స్వరముల దొరకని జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సర స స్వర సుర జరిగామనమౌ సామవేద సారమిది

No comments:
Post a Comment