Monday, December 5, 2011

మరుగేలరా ఓ రాఘవా - త్యాగ రాజ కృతులు

రాగం: జయంతశ్రీ
మేళ కర్త: 20 నటభైరవి  జన్య
అగ-శుమ-శుదై-కైని
ఆ  : స  గ మ ద  ని స
అవ : స  ని  ద  మ  ప  గ  స
తాళం: దేశాది
 
పల్లవి  
మరుగేలరా  ఓ  రాఘవ
 
అనుపల్లవి  
మరుగేల  చరా చర  రూప  పరాత్పర  సూర్య  సుధాకర  లోచన  
 
చరణం  
అన్ని  నీవనుచు  అంతరంగమున  తిన్నగా  వెదకి  తెలిసి  కొంటినయ్య
నిన్నే  గాని  మది  నెన్నజాల  నొరుల  నన్ను  బ్రోవవయ్య  త్యాగరాజనుత  

అప్ప రామ భక్తీ - త్యాగ రాజ కృతులు

రాగం: కామవర్ధని
మేళ కర్త : 51 పంతువరాళి  
శురి-అగ-పమ-శుదై-కాని
ఆ: స రి గ మ ప ద ని స
అవ  : స ని  ద  ప  మ గ  రి  స
తాళం: రూపక

పల్లవి
అప్ప!  రామభక్తి  ఎంతో   గొప్పరా; మా  (అప్ప)
 
అనుపల్లవి
త్రిప్పటలను దీర్చి  కంటి  రెప్పవలెను  గాచు  మా  (అప్ప)  

చరణం 1
లక్ష్మి  దేవి  వలచున? లక్ష్మణుండు  గొలుచునా?
సూక్ష్మబుద్ధి  గల  భరతుడు  జూచి జూచి  సోలసున? మా (అప్ప)
 
చరణం  2
శబరి  ఎంగిలి  నిచ్చునా? చంద్రధరుడు  మెచ్చునా?
అబల స్వయంప్రభకు  దైవమచల  పదవి  నిచ్చునా ? మా (అప్ప)

చరణం 3
కపి  వారధి  దాటున  కలికి  రోత  గాటున
అపరాధి  త్యాగరాజుకనందము  హెచ్చున ? మా (అప్ప)