Sunday, October 30, 2011

తెలవారదేమో - శ్రుతి లయలు

తెలవారదేమో  స్వామీ
తెలవారదేమో  స్వామీ
నీ  తలపుల  మునుకలో
అలసిన  దేవేరి  అలమేలు  మంగకు

చెలువము  నేలగ  చెంగట  లేవని
కలతకు  నెలవై  నిలచిన  నెలతకు
చెలువము  నేలగ  చెంగట  లేవని
కలతకు  నెలవై  నిలచిన  నెలతకు
కలల  అలజడికి  నిద్దుర  కరువై
అలసిన  దేవేరి  అలసిన  దేవేరి  అలమేలు
మంగకూ

మక్కువ  మీరగ  అక్కున  చేరిచి
అంగజు  కేలిని  పొంగుచు  తేల్చగ
మక్కువ  మీరగ  అక్కున  చేరిచి
అంగజు  కేలిని  పొంగుచు  తేల్చగ
ఆ  మత్తునే మది  మరి  మరి  తలచగ
మరి  మరి  తలచగ
అలసిన  దేవేరి  అలమేలు  మంగకు
తెలవారదేమో  స్వామీ  గ  మా  ప  ని
తెలవారదేమో

స  ని  ద  ప  మా  ప  మా  గ  ని  స  గ  మా
 తెలవారదేమో  స్వామీ
ప  ని  ద  ప  మా  గ  మా
ప  స  ని  ద  ప  మా  గ  మా
ప  స  ని  రి  స  గ  రి  మా  గ  రి  స  రి  ని  స

తెలవారదేమో  స్వామీ 

No comments:

Post a Comment