నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ

సరస సరాగాల సుమరాణి నీ
స్వరస సంగీతాల సారంగినీ ||౨||
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా ||౨||
మవ్వంపు నటనాల మాతంగినీ
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నిన్నే ఆరాధించు నీ దాసీ నీ
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ ||౨||
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే ||౨||
చిరునవ్వు లో నేను సిరిమల్లి నీ
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకెలా
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతా వేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా ఆ ఆ ఆ అ
నిన్నటిదాకా శిలనైన , నీ పదము సోకి నే గౌతమి నైనా
నిన్నటిదాకా శిలనైనా
No comments:
Post a Comment