తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
నికొరకే రాజా..వెన్నెల రాజ
కలనైన నీ వలపే ||౨||
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు
కళలు కాంతులు నీ కొరకేలే ||౨||
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
కనుల మనోరథ మాధురి దాచి ..ఆ ఆ......
కానుక చేసే వేలకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
No comments:
Post a Comment