Tuesday, November 1, 2011

పగలే వెన్నెల - పూజ ఫలం

ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ అ 
ఆ ఆ ఆ ఆ అ అ అ అ అ ఆ అ 

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెలా జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచే 
నీటిలోన కలువభామ పొంగి పూచే 
ఈ అనురాగమే జీవనరాగమై  ||౨||
ఎదలో తేనెజల్లు కురిసిపోదా 

పగలే వెన్నెలా జగమే ఊయల

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళి పాట విన్న నాగు శిరసునుపే 
ఈ అనుబంధమే మధురానందమై  ||౨||
ఇలపై నందనాలు నిలిచిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే 
పూల ఋతువు సైగ చూచి పికము పాడే ||౨||
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఏ ఎ ఏ ఎ ఎ ఎ 
పగలే వెన్నెల



No comments:

Post a Comment