Friday, October 28, 2011

చూడరమ్మ - అన్నమయ్య కీర్తనలు

ప: చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మకూడున్నది పతి చూడి కుడుత నాంచారి
చ: శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి

చ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

చ అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమౄతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

No comments:

Post a Comment