Monday, November 22, 2010

gOranta deepam - rAyinaina kAkapOtini

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా

పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణని నోచన

కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా

కాకినైన కాకపోతిని ఘాతకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
కాకినైన కాకపోతిని ఘాతకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా

మహిని అల్ప జీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా

పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా






No comments:

Post a Comment